Header Banner

ఏపీలో పెన్షనర్లకు షాక్..! జాబితా నుంచి వారి పెర్లు తొలగింపు!

  Thu May 01, 2025 07:08        Politics

ప్రతీ నెలా 1వ తేదీ వస్తే.. పెన్షనర్లకు పండగే. ప్రభుత్వం తమను ఆదుకునేందుకు డబ్బు ఇస్తుందని పెన్షనర్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కూడా.. పెన్షనర్లకు ప్రతీ నెలా మిస్సవకుండా పెన్షన్ ఇస్తోంది. అందువల్ల ప్రతీ నెలా.. ముసలివారు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్య్సకారులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు, సంప్రదాయ చర్మకారులు.. ఇలా ఎందరో పెన్షన్ పొందుతున్నారు. కానీ.. షాకింగ్ విషయం ఏంటంటే.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పెన్షన్ దారుల జాబితా నుంచి 3,20,560 మంది పేర్లను తొలగించింది. నిజానికి కూటమి ప్రభుత్వం పెన్షన్ దారుల సంఖ్యను పెంచామనీ, కొత్తగా వితంతువులకు కూడా పెన్షన్ ఇస్తున్నామని చెబుతోంది, అది నిజమే.

మే నెల నుంచి కొత్తగా 89వేల మందికి పెన్షన్ ఇస్తున్నారు. కానీ.. లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్న పేర్లు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మాజీ సీఎం జగన్.. ఏపీ సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి ఏపీలో ఉన్న పెన్షన్ దారుల సంఖ్య 6634372. అది అధికారిక లెక్క అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మే నెలకి ఇస్తున్న మొత్తం పెన్షన్ దారుల సంఖ్య 63,13,812. అంటే.. కూటమి ప్రభుత్వం వచ్చాక, ఇప్పటివరకూ తొలగించిన పెన్షనర్ల సంఖ్య 3,20,560. గత డిసెంబర్ నుంచి రీ-వెరిఫికేషన్ చేసి, చాలా మంది అనర్హుల పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. అనర్హులను జాబితా నుంచి తొలగించడం తప్పేమీ కాదు. అది సరైన నిర్ణయమే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తద్వారా ప్రజలు టాక్సుల రూపంలో చెల్లించే డబ్బు వృథా కాదు. అనర్హులే కాదు.. చనిపోయిన వారి పేర్లను కూడా జాబితా నుంచి తొలగిస్తారు. అందువల్ల ప్రతీ నెలా.. లబ్దిదారుల సంఖ్య తగ్గడం సహజం. అనర్హులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తే, ఆ విషయాన్ని ప్రభుత్వం ధైర్యంగా చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పెన్షన్లను భారీగా పెంచింది. ముసలివారికి నెలకు రూ.4,000 ఇస్తోంది. ఇది దేశంలోనే అత్యధికం. పక్కనే ఉన్న ధనిక రాష్ట్రం తెలంగాణలో కూడా ఇంత ఎక్కువగా ఇవ్వట్లేదు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా, పెన్షనర్లకు మాత్రం ప్రతి నెలా 1వ తేదీనే ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ ఇస్తోంది. ఇందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు.

 

గత వైసీపీ ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వాలంటీర్లు.. నెల నెలా కమీషన్ తీసుకుంటూ.. అనర్హులను పెన్షన్ దారుల జాబితాలో చేర్చారనీ, దివ్యాంగులు కాని వారిని కూడా దివ్యాంగులుగా చూపించి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చాక, ఇలాంటి వాటిని సరిచేస్తూ ముందుకు వెళ్తోంది. అందువల్ల అనర్హుల పేర్లను జాబితా నుంచి తీసేస్తోంది. ఇంత భారీ సంఖ్యలో అనర్హులు ఉండటం షాకింగ్ విషయమే. అంటే, వైసీపీ హయాంలో చాలా మంది అనర్హులకు పెన్షన్లు లభించాయి. అదంతా ప్రజల డబ్బు. గత వైసీపీ ప్రభుత్వం దాన్ని అనర్హులకు అప్పనంగా ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చెయ్యడం మొదలుపెట్టింది. అయితే.. ఏపీలో కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. వారికి అవకాశం కల్పించి, వారి పేర్లను జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది. అనర్హులకు ఇవ్వడం ఎంత తప్పో, అర్హులకు ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు అవుతుంది. అందువల్ల త్వరలోనే అర్హుల పేర్లను జాబితాలో చేర్చుతారని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #PensionersShock #PensionList #BeneficiaryRemoval #APGovt #SeniorCitizens #WelfareCut